అంశము : గూగుల్ ఇన్పుట్ టూల్స్ (గూగుల్ ఆంగ్లేతర బాష సాధనాలు)
పాఠ్య లక్ష్యం: కంప్యూటర్, లాప్ టాప్ లలో రాయటం (టైపు) ఎలా ? ఏ ఉపకరణాలు ఉపయోగించాలి, వాటిని ఎలా ఇంస్టాల్ చేసుకోవాలి తెలుసుకొంటారు.
ఈ పాఠములో -
1. గూగుల్ ఇన్ ఫుట్ సాధనాలు - పాఠ్యము 10 నిమిషములు (మీరు ఈ పాఠ్యములో సూచనలని పాటిస్తూ భాషా ఉపకారణాలని మీ కంప్యూటర్ / లాప్ టాప్ లో ఇన్స్టాల్ చేసుకోవచ్చు)
2. గూగుల్ ఇన్ ఫుట్ సాధనాలు - వీడియో 4.55 నిమిషములు ( వీడియోలో చూపిన క్రమములో మీరు కూడా భాషా ఉపకారణాలని మీ కంప్యూటర్ / లాప్ టాప్ లో ఇన్స్టాల్ చేసుకోవచ్చు)
3. అభ్యాసము
అభ్యాస ఫలితం : గూగుల్ ఇన్పుట్ టూల్స్ ఇంస్టాల్ చేసుకోవటం, క్రోమ్ బ్రౌజరులో వాటిని ఉపయోగించి తెలుగులో ఎలా టైపు చెయ్యవచ్చో నేర్చుకొంటారు.
గుగూల్ ఇన్పుట్ భాష సాధనాలు ఇన్స్టాల్ చేసుకోవడానికి మీ క్రోమ్ బ్రౌసర్ లో ఈ క్రింది విధంగా టైప్ చేయండి
"google input tools telugu"
గూగుల్ ఇన్పుట్ టూల్స్ ఎలా ఇన్స్టలేషన్ చేసుకోవాలి - ప్రక్రియ
ఇక్కడ https://www.google.com/intl/te/inputtools/ క్లిక్ చేసి chrome లో అన్న మెనూ క్లిక్ చేయండి
బాష ఉపకరణాలు ఎంచుకోవటం
తెలుగు కోసం "అ" ను ఎంచుకొనండి
ఇన్‌పుట్ సాధనాన్ని ఉపయోగించడానికి, బ్రౌజరులో కుడిచేతి వేపు ఫై బాగాన కనిపిస్తున్న పొడిగింపు చిహ్నంపై క్లిక్ చేయండి.
కనిపించే డ్రాప్-డ్రౌన్ మెనులో, కావల్సిన తెలుగు ఇన్‌పుట్ ఎంచుకోండి.
ఇప్పుడు మీరు ఇన్‌పుట్ సాధనాన్ని ప్రారంభానికి టోగుల్ చేసారు, వెబ్ పేజీని తెరిచి, కర్సర్‌ను ఇన్‌పుట్ పెట్టె వద్దకు తరలించి ఆపై టైప్ చేయడాన్ని ప్రారంభించండి. ఇది పని చేయకపోతే, పై క్లిక్ చేయడం ద్వారా వెబ్ పేజీని రీఫ్రెష్ చేయండి.
ఇన్‌పుట్ సాధనం ప్రారంభించబడితే, తెలుగులో "అ" అక్షరం బటన్ నీలపు రంగులో కనిపిస్తుంది.
ఇన్‌పుట్ సాధనం ఆపివేయబడినప్పుడు, "అ" అక్షరం బటన్ బూడిద రంగులోకి మారుతుంది.
ఆపివేయి" క్లిక్ చేస్తే, ఇన్‌పుట్ సాధనం ఆపివేయికి టోగుల్ అవుతుంది.
మీరు ఎంచుకున్న ఇన్‌పుట్ సాధనాలపై క్లిక్ చేయడం ద్వారా కూడా వాటిని ప్రారంభించడం / ఆపివేయడం మధ్య టోగుల్ చేయవచ్చు
ఇన్పుట్ బాష వాడుకతో మీరు తెలుగు లో సులభం గా టైపు చేసుకోవచ్చు